Listen to this article

జనం న్యూస్ 23 డిసెంబర్, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం,సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూర్ గ్రామంలో, గ్రామపంచాయతీ కార్యాలయంలో, ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, మరియు వార్డు సభ్యులకు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పదవి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా కొల్లూర్ గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ మాట్లాడుతూ, గత పాలకవర్గం పదవి కాలం ముగిసిన తర్వాత, ఎన్నికలు వాయిదా పడటం, సుమారు రెండు సంవత్సరాలుగా, గ్రామ పంచాయతీలకు పాలకవర్గం లేకపోవడంతో, గ్రామంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి, గ్రామ పెద్దల సూచనలు, సలహాలు తీసుకొని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామాభివృద్ధి కొరకు తనపై నమ్మకం ఉంచి, తనను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో, గ్రామపంచాయతీ కార్యదర్శి, శ్రీనివాస్, మరియు కొల్లూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.