Listen to this article

(జనం న్యూస్ చంటి డిసెంబర్ 23) దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో ఈనెల 26న నిర్వహించనున్న కీ.శే. కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ జాతరను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం రోజున జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూసాముల గుండెల్లో దడ పుట్టించి, రైతు కూలీల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ అని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేవల్ కిషన్ ముదిరాజ్ జాతర నిర్వహణకు రూ.5 లక్షలు కేటాయించడం అభినందనీయమని తెలిపారు.ఈ జాతర రైతులు, కూలీలు, ప్రజాస్వామ్య శక్తులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొంటూ, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను ఘనంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దమ్మిగారి కనకయ్య ముదిరాజ్, మహాసభ నాయకులు ఊళ్లేంగాల సాయి ముదిరాజ్, బేగంపేట సర్పంచ్ చందు ముదిరాజ్, పెద్ద మాసన్‌పల్లి మాజీ సర్పంచ్ స్వామి ముదిరాజ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, సీనియర్ నాయకులు కోరంద రవీందర్ రెడ్డి, బాల్తే వెంకటేశం, సోలిపేట ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.