తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ డిసెంబర్ 23
జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ మండలం కోహిర్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారి 65 సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న డాల్ఫిన్ ట్రావెల్స్ బస్సు మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది సమాచారం అందుకున్న టోల్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పోలీసులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు బస్సులోని ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా సురక్షితంగా బయటకు తీశారు ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు దీంతో ప్రయాణికులు టోల్ ప్లాజా సిబ్బందిని మరియు పోలీసులను అభినందించారు ఈ ప్రమాదంలో ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఇకనైనా రవాణా శాఖ సిబ్బంది ట్రావెల్స్ యజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలి ప్రయాణికులు ప్రయాణించాల్సిన బస్సులో సరుకుల అధిక లోడ్ రవాణా చేయడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా అధికారులు తనిఖీలు చేపట్టి వదిలేస్తున్నారు దీనిపై పై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి




