Listen to this article

జనం న్యూస్‌ 24 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ఎస్ వి ఎన్ నగర్ లోని భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ నివాసంపై ఏ సీ బి అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టారు. గత నెలలో రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన తనిఖీల్లో లభించిన కీలక డాక్యుమెంట్లు, మొబైల్ డేటా ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కాగా, భోగాపురంలోని ఒక ప్రైవేట్ ఏజెంట్ ఇంట్లో రూ.15 లక్షల, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.