జనం న్యూస్ 24 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఈరోజు జోగులమ్మ గద్వాల జిల్లా కేంద్రంలోని టి యు సి ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి చింతరేవుల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు హరీష్ మాట్లాడుతూ…గ్రామీణ ప్రజలకు జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గుర్ అండ్ అజివిక మిషన్ పేరు తో ఒక కొత్త బిల్లు పార్లమెంటులో పెట్టడం సరికాదు అన్నారు కేంద్ర ప్రభుత్వం రెండు దశాబ్దాల కాలంగా వ్యవసాయ కూలీలు అసంఘటిత రంగ కార్మికులు పల్లె నుండి ఢిల్లీ దాకా చేసిన కార్మిక ఉద్యమాల వలన పార్లమెంటులో దాదాపు 90 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి కార్మికులకు అన్ని రకాలుగా వసులుబాటు ఉండే విధంగా చేసిన చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆన్ని అన్నారు 2006 సంవత్సరం నుండి అమలులోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది అన్నారు వలసలు నివారించి గ్రామీణ ప్రాంతపు కార్మికులకు స్థానికంగా పని కల్పించి తదవరా గ్రామీణ ఉమ్మడి వనరులను అభివృద్ధి చేస్తూ కార్మికులకు జీవనోపాధి కల్పించడం చట్ట ప్రధానమే అని అన్నారు ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుండి గ్రామాలలో చాలావరకు వెట్టి చాకిరి నిర్మూలన వలసల నివారణ జరిగిందన్నారు
ఒక కొత్త బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో గ్రామీణ ప్రాంతపు కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా నాయకులు రంగన్న,స్వరాజు,రాముడు,రాజు తదితరులు పాల్గొన్నారు


