Listen to this article

జనం న్యూస్ 24డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండలం రాజాంపేట్ గ్రామంలో మంగళవారం రాత్రి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యాం నాయక్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అతిథులు క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజాంపేట్ సర్పంచ్ బుర్స పోచయ్య,అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రైస్తవ సంఘ నాయకులు,పాస్టర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్