Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 24

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచునూర్ గ్రామ సర్పంచ్ శ్రీహరి వారి పాలక మండలి తో కలిసి బుధవారం ఉదయం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయానికి పాదయాత్రగా బయలుదేరి గణనాథుని దర్శించుకున్నారు. ఈ పాదయాత్రలో గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయానికి చేరుకొని గణనాథుని కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ శ్రీహరి వారి పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాధ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా గుండ్ల మాచనూర్ సర్పంచ్ శ్రీహరి మాట్లాడుతూ, గణనాథుని ఆశీస్సులతో గుండ్ల మాచునూర్ గ్రామాన్ని పాలక మండలి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు.ఈ పాదయాత్రలో ఉపసర్పంచ్ శంకర్‌తో పాటు వార్డ్ సభ్యులు ఎస్. బాబు, కె. భద్రేశ్, జి. శివకుమార్, వి. రమేష్, జి. జంగయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.