Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా

పటాన్‌చేరు మండల పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో లావణ్య, ఆలయ చైర్మన్ హరి ప్రసాద్ రెడ్డి, ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టారు.97 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా, జనరల్ హుండీ ద్వారా రూ.27,20,447, అన్నదాన హుండీ రూపంలో రూ.1,31,403 లభించినట్లు తెలిపారు. మొత్తం హుండీ ఆదాయం రూ.28,51,850 గా నమోదైందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు విశేషంగా స్వామివారికి కానుకలు సమర్పించినట్లు పేర్కొన్నారు.గణనాథుని ఆశీస్సులతో ఈ హుండీ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం వినియోగించనున్నట్లు ఆలయ ఈవో లావణ్య తెలిపారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, జోషి సంతోష్, చంద్రశేఖర్ పంతులు, సతీష్, అయ్యప్ప పంతులు, జగదీశ్వర్ స్వామి, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం శాంతియుతంగా, భక్తిశ్రద్ధల మధ్య కొనసాగిందని ఆలయ వర్గాలు తెలిపాయి.