జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం:
స్థానిక కైట్స్ డిగ్రీ కాలేజీలో సెంట్రల్ యూనివర్సిటీ పీజీ ప్రవేశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక కేంద్ర విశ్వ విద్యాలయం డీన్ ప్రొఫెసర్ డా. వెంకట రమణ పాల్గొని, కేంద్ర విశ్వ విద్యాలయాల పీజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూఈటీ–పీజీ)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన పీజీ ప్రవేశాలకు జనవరి 14 లోగా దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష మార్చి నెలలో నిర్వహించబడుతుందని, డిసెంబర్ 14 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయిందని వివరించారు.ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 30 పీజీ కోర్సులతో పాటు మరో 5 కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కైట్స్ కాలేజ్ కరస్పాండెంట్ రెడ్డి చిరంజీవి,డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆడారి అప్పలనాయుడు, డైరెక్టర్లు ఆడారి సన్యాసిరావు, విల్లూరి ప్రసాద్,సరిసా సన్యాసిరావు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.



