జనం న్యూస్ డిసెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆ మహనీయుని ఆదర్శాలు, ఆశయాలు అనిర్వచనం.
విగ్రహా విష్కరణను జయప్రదం చేయండి.
ప్రజలకు… బీజేపీ నేత డాక్టర్ ఏలూరి.
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పాయ్ గారి 100వ జయంతిని పురష్కరించుకుని అమరావతి రాజధానిలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేది కాస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
దేశం గర్వించ దగ్గ మహా నేత అటల్ జీ అని, ఆ మహనీయుని జీవితం దేశ ప్రజలకు, నేటి తరం రాజకీయాలకు మార్గదర్శకమని ఆయన గుర్తు చేశారు.అటల్ జీ ఆలోచనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అందువల్లనే ఆయనను పార్టీలకు, వర్గాలకు, ప్రాంతాలకు, కుల మతాలకు అతీతంగా గౌరవిస్తున్నారని డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు.అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహం రాష్ట్రానికే కాకుండా దేశానికే ఒక స్ఫూర్తికేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. వాజ్పాయ్ గారి జీవితం, వారి రాజనీతి, ప్రజాసేవా దృక్పథం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉంటాయన్నారు. అలాగే వాజ్పాయ్ విలువలతో కూడిన రాజకీయాలు చేసారని అన్నారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అవసరమైన సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచి, నిర్మాణాత్మక సలహాలు, సూచనలు చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. పార్లమెంట్ వేదికగా ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపుతూ, అదే సమయంలో దేశ ప్రయోజనాలకు అనుకూలమైన నిర్ణయాలకు మద్దతు ఇచ్చిన చరిత్ర ఆయనదని గుర్తు చేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశ అభివృద్ధికి అటల్ జీ దీర్ఘకాలిక దృష్టితో కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జాతీయ రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్జాతీయంగా భారతదేశ గౌరవాన్ని పెంచిన విదేశాంగ విధానం.. ఇవన్నీ ఆయన పరిపాలన దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. అటల్ జీ జీవితం యువతకు ఒక పాఠమని, రాజకీయాల్లోకి వచ్చే ప్రతి యువకుడు ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. నిజాయితీ, సహనం, దేశభక్తి, అభివృద్ధి పట్ల నిబద్ధత ఇవే అటల్ జీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంగా అమరావతిలో జరగనున్న అటల్ బిహారీ వాజ్పాయ్ కాస్య విగ్రహ ప్రారంభోత్సవం ప్రజాస్వామ్య విలువలను గుర్తుచేసే ఒక చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని అన్నారు.
కావున ప్రజలందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.


