జనంన్యూస్. 24. నిజామాబాదు. రురల్. శ్రీనివాస్ పటేల్.
కాంగ్రెస్ బలోపేతానికి కలిసి పనిచేయాలి –రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సన్మానించారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్‌లో ఉన్న నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ సర్పంచ్ రాజేందర్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే భూపతి రెడ్డి గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.అలాగే జక్రాన్‌పల్లి, అర్హుల్ గ్రామాలకు చెందిన వార్డ్ మెంబర్లు, సిరికొండ మండలం రావుట్ల గ్రామ వార్డ్ మెంబర్లను కూడా ఎమ్మెల్యే సన్మానించారు. డిచ్పల్లి మండలం బర్దిపూర్కు చెందిన కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…గ్రామ ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని, మరో ఐదేళ్లు అధికారంలో ఉండేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని అన్నారు. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు నిరుత్సాహపడకుండా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు.
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని పొందిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.



