శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు బుధవారం ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర కు బయలుదేరినారు. కఠినమైన నియమాలను పాటిస్తూ 41 రోజులపాటు మండల దీక్ష చేసిన స్వాములు దేవాలయంలో గురు స్వామి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఇరుముడి కట్టినారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోషతో భజనలు చేస్తూ శబరిమల యాత్రకు బయలుదేరినారు. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి మణికంఠ స్వాములు ఉప్పు నరసయ్య వినుకొండ రాజ్ కుమార్ నామని శివ కందగట్ల రమేష్ కొత్త పెళ్లి రవీందర్ లోకల బోయిన కుమారస్వామి బాసని బాలకృష్ణ కోమటి రవికుమార్ ముల్కనూరు సంజయ్ దిలీప్ శంకరాచారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



