జనం న్యూస్ 26 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎం ఎల్ సీ వరదు కళ్యాణి అన్నారు. విశాఖ వై సీ పీ కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి పీఏ ఓ మహిళపై వేధింపులకు గురి చేశారని ఫిర్యాదు చేస్తే బాధిత మహిళలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మహిళా శాఖ మంత్రి అయినప్పటికీ మహిళలకు విలువ లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. పీఏ డబ్బులు తీసుకున్నది నిజమా కాదా అని మంత్రిని ప్రశ్నించారు.


