Listen to this article

బిచ్కుంద డిసెంబర్ 26 జనం న్యూస్

గురువారము ఉదయం తాండూర్ పట్టణంలో స్వర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర చేసి వచ్చిన బృందానికి వినయ్ గురుస్వామికి శ్రీ రేణుక మాత స్వామికి రాహుల్ స్వామికి కప్ప గణేష్ గురు స్వామికి శ్రీ సంతోష్ స్వామికి ముదిరెడ్డి విట్టల్ రెడ్డి స్వామికి మల్లికార్జున స్వామికి ఘనంగా గుర్రాల రతములో తాండూర్ పట్టణంలోని వీధుల గుండా ఊరేగింపు చేసినారు.ఇంచుమించు ఐదు కిలోమీటర్లు పొడవునా మేల తాళాలతోటి తాండూర్ లో ఉన్న ప్రముఖ గుడి లలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం లో శ్రీ కాళికామాత ఆలయంలో శ్రీ భద్రేశ్వర్ ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ భవాని మాత ఆలయంలో స్వాగతం పలికి పూజలు చేసి సన్మానాలు చేయడం జరిగింది. ప్రతి ఆలయంలో ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం చేసినారు ఇట్టి కార్యక్రమంలో తాండూర్ గురు స్వాములు సాయిల్ గౌడ్ గురు స్వామి నరసింహులు గౌడ్ గురు స్వామి శ్రీనివాసరెడ్డి గురు స్వామి జైపాల్ రెడ్డి గురుస్వామి కేశవరెడ్డి గురుస్వామి బాలు గౌడ్ గురు స్వామి గోవింద్ గురు స్వామి శీను గురుస్వామి ప్రశాంత్ రెడ్డి గురుస్వామి రామచంద్ర గురుస్వామి మనోహర్ గురుస్వామి మహేందర్ గురుస్వామి మల్లారెడ్డి స్వామి చంద్ర శేఖర్ స్వామి ఈ సంవత్సరం పాదయాత్ర చేసిన సీనియర్ గురు స్వాములు స్వాములు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొని తాండూర్ ఐక్యతను చాటినారు .తాండూర్ గురు స్వాములకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను చేసిన సేవ చాలా చిన్నది .కానీ ఈరోజు వారు చూపిన ప్రేమ అభిమానం గురుస్వామి మీద ఉన్న అభిమానం ప్రేమ మాటల్లో చెప్పటానికి సరిపోలేదు. ఈ ప్రేమను భగవంతుడు ఎప్పటికీ ఇలాగే ఉంచాలని నేను అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుతున్నా.