Listen to this article

(జనం న్యూస్ చంటి డిసెంబర్ 26) దౌల్తాబాద్, డిసెంబర్ 26:

సిద్దిపేట జిల్లా కలెక్టర్ & జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బిజ్జూరి రవికుమార్ DPRO/AD ఆదేశాల మేరకు టి.యస్.యస్, దుబ్బాక టీం ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ప్రభాత భేరి కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, డ్రగ్స్ నియంత్రణ, ప్లాస్టిక్ నిషేధం, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వంటి అంశాలపై సాంస్కృతిక సారథి కళాకారులు మాట, పాటల రూపంలో ప్రజలకు వివరించారు. కళాకారుల ప్రదర్శనలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గంగాధరి. స్వప్న స్వామి , ఉప సర్పంచ్ తాటి సాయి .వార్డ్ నెంబర్ బొల్లం రాజేష్. దౌల్తాబాద్ పోలీసు కానిస్టేబుల్ సాయి చరణ్ , కానిస్టేబుల్ కుమార్ , ఇతర పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు:ఆస రామారావు – టీం లీడర్ బిట్ల ఎల్లయ్య కమ్మరి నర్సయ్య తుమ్మల ఎల్లయ్య సందుర్ల శేఖర్
గ్రామస్థులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని నిర్వాహకులను కోరారు.