జనంన్యూస్. 27.సిరికొండ
మస్ లైన్ రాష్ట్ర సదస్సుకు హైదరాబాద్ తరలిన నేతలు.. మానవ సమాజ వికాసానికి కమ్యూనిస్ట్ సమాజమే పరిష్కారం. అని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్(ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ స్పష్టం చేశారు.
శనివారం నాడు హైదరాబాద్ లో జరుగనున్న సిపిఐ(ఎంఎల్) మస్ లైన్ రాష్ట్ర సదస్సుకు నేతలు తరలివెళ్లారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు: కమ్యూనిజం ఒక వర్గ రహిత సమాజం అన్నారు. శ్రమజీవుల శ్రమకు విలువ ఇచ్చి సమాజం అన్నారు. నేడు కమ్యూనిజం అంటే పెట్టుబడుదారులు, కార్పొరేట్లకు గిట్టదని అందుకే అందుకే కమ్యూనిజంను లేకుండా చేయాలని పగటి కళలు కంటున్నారన్నారు. శ్రమ దోపిడీ తమ పెరుగుదలకు కారణమని దాన్ని కాపాడుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారన్నారు. సామ్రాజ్యవాదం అగ్ర రాజ్యాల మధ్య మార్కెట్ పోటీల కోసం సృష్టించబడ్డది యుద్ధం అని పేద మధ్యతరగతి దేశాల పైన యుద్ధంను రుద్ధుతున్నారు అన్నారు. పేదలు అయినా కష్టజీవులంత సమసమాజ నిర్మాణం కోసం . పోరాడాలని ఆయన కోరారు.హైదరాబాదులో నేడు జరుగుతున్న రాష్ట్ర సదస్సుకు తరలి వెళ్లిన వారిలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, ఎం సాయరెడ్డి, మండల నాయకులు ఎం లింబాద్రి, ఇ రమేష్, బి కిశోర్, ఎం అనిస్, బి సర్పంచ్ తదితరులతో పాటు నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నుండి 40 మంది కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్ళారు.


