Listen to this article

ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 27

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే క్యాంపస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి పరిస్థితులు, పంటల మద్దతు ధరలు, రైతు సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు అనుకూల కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని చిట్టెంపల్లి బాలరాజ్ కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందాలని ఆకాంక్షిస్తూ ఇరువురు శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగి, జిల్లాలో రైతు సమస్యలపై సమిష్టిగా ముందుకు సాగేందుకు దోహదపడిందని నాయకులు తెలిపారు.