జనం న్యూస్ డిసెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాట్రేనికోన మండలం చెయ్యేరు జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు ఎంపీ మరియు ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భవితా స్కూల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల అవసరాలను గుర్తించి, పెద్దల ఆర్థిక సహకారంతో భవితా స్కూల్కు అవసరమైన ఉపకరణాలు, పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు.దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ నిలుస్తుందని, వారి సంక్షేమం, విద్యా అభివృద్ధికి అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద కూటమి సీనియర్ నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



