

జనంన్యూస్. 05.నిజామాబాదు. ప్రతినిధి.భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన తర్వాత . ఢిల్లీకి పోయి పెద్దల ఆశీర్వాదం తీసుకొని అందరి సహకారంతో తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలుపుతాను అని పార్టీ నామీద నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యత మరింత రెట్టింపు చేసుకొని ఈరోజు నిజామాబాద్ జిల్లాకు రావడంతో దినేష్ కులచారి పటేల్.ని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద సిరికొండ మండల నాయకులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సిరికొండ మండల నాయకులు పార్టీ కార్యకర్తలు. దినేష్ అన్న అభిమానులు పాల్గొన్నారు.