జనం న్యూస్ డిసెంబర్ 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం;
మేకలు, గొర్రెలు పెంచుతున్న రైతులు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత నట్టల నివారణ మందులను తప్పకుండా త్రాగించి, తమ పశువులను నట్టల నుంచి రక్షించుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ డీవీఏహెచ్‌ఓ డాక్టర్ గంగాధరయ్య తెలిపారు. మండల పశువైద్యాధికారి జి. రాజలక్ష్మి, బట్టాపూర్, తోర్తి గ్రామాల సర్పంచులు బి. ప్రవీణ్ యాదవ్, కౌడ భూమేశ్వర్, ఉపసర్పంచులు మూడ్ దయానంద్, సుమన్ గౌడ్లతో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేకలు మరియు గొర్రెలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేస్తే అవి ఆరోగ్యంగా ఉండి, రైతులకు మంచి లాభం చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాలోత్ భీమా నాయక్, హుస్సేన్, పోకల్కర్ గణేష్; గ్రామస్తులు గణేష్ యాదవ్, గోరె మియా, గోజల శ్రీకాంత్, ఆశన్న, మహేందర్ యాదవ్, మౌలానా, బాబూలాల్; సిబ్బంది ఎల్‌ఎస్‌ఏ నరేందర్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


