జనం న్యూస్ డిసెంబర్ 28 సంగారెడ్డి జిల్లా
దేశ చరిత్రలో.. పంచాయితీ ఎన్నికలలో గెలుపు కొరకు, ప్రచారం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడానికి రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసినా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి చెప్పుకోదగ్గ ఫలితాలు ఏమి రాలేదన్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డి పోచారం మునిపాలిటీ పరిధిలో కాజీపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు, ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ మేరకు వారిని బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గతంలో 8 వేల స్థానాల నుండి 2 వేల స్థానాలకు బీ.ఆర్.ఎస్ పడిపోయిందన్నారు. బిజెపి మాత్రం.. 163 సర్పంచ్ స్థానాల నుండి 1000 కి పైగా స్థానాలు సంపాదించుకొని 514 % పెరుగుదల చూపించిందన్నారు. గ్రామాల అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమన్నారు.దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. వచ్చే మునిపాలిటీ, జీ హెచ్ఎం సీ ఎన్నికల్లో బీజేపీ దే గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి , బొల్లారం మండల అధ్యక్షులు కొత్వాల్ ఆనంద్ కృష్ణ రెడ్డి , బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


