జనం న్యూస్ 29 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా.
జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామ సర్పంచ్ జె. వీరేష్ స్వామి గట్టు మండలం నందు కొత్తపల్లి గ్రామంలో గొర్రెలకు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా గౌరవ చాగదోన గ్రామ సర్పంచ్ జె. వీరేష్ స్వామి హాజరై, పశువైద్యాధికారి డాక్టర్ పృధ్వి తో కలిసి గొర్రెల కాపారులకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని గొర్రెలు మరియు మేకల పెంపకదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. గ్రామంలో మొత్తం 400 గొర్రెలు మరియు 100 మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు త్రాగించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో పశువైద్య సిబ్బంది గంగాధర్, గ్రామస్తులు రోగప్ప గాల నరసింహులు, బుల్లి తిమ్మప్ప, మల్లేష్,నాగరాజు,రంగప్ప, ఎల్లప్ప ,అంజి ,గొర్రెల కాపారులు పాల్గొన్నారు…


