జనం న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ ఆంజనేయ నగర్ చౌరస్తా వద్ద శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ చున్ను పాషా ఆధ్వర్యంలో జరగగా, ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వంతో పాటు అపారమైన కార్యకర్తల శక్తి ఉందన్నారు. ఒక రాజకీయ పార్టీ 140 సంవత్సరాల పాటు నిరంతరంగా ప్రజల మధ్య నిలిచి ఉండటం సాధారణ విషయం కాదని, ఇది చరిత్రలో అరుదైన ఘనతగా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. నేటికీ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన స్పష్టం చేశారు.అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి (పీజేఆర్) వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్మిక నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పీజేఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పలు శాఖలకు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత పీజేఆర్ కే దక్కుతుందని బండి రమేష్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని విభాగాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు



