బాలునాయక్, ఎంపీ రఘువీర్ రెడ్డి సమక్షంలో ఆత్మీయ సమ్మేళనం. పీ.ఏ.పల్లి , గుడిపల్లిమండలం లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధిలు, వార్డు మెంబర్లు కి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఎంపీ రఘువీర్ రెడ్డి సమక్షంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గెలిచిన అభ్యర్ధులు కి ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్ శాలువ కప్పి సన్మానించారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు గ్రామ ప్రజలు కి చేరేలా కృషి చేయాలని చెప్పాడు.108 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధిలు విజయం సాధించడం గొప్ప ప్రయత్నం అని కొనియాడారు.50 చోట్ల బి ఆర్ ఎస్, బీజేపీ గెలుపును ఆస్వాదించారు.గుడిపల్లి మండలం లోని 11 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగింది, పీ.ఏ.పల్లి మండలం లో 21 గ్రామం పంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కి రానున్న ఎంపీటీసీ జడ్ పీ టీసీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలి అని ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బాలునాయక్ చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బాలునాయక్ మాజీ ఎంపీపీ లు జడ్పీటీసీ లు, ఎంపీటీసీ లు సర్పంచులు పాల్గొన్నారు. దేవరకొండ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేశారు అని చెప్పారు.




