Listen to this article

మెదక్,డిసెంబర్ 29 ( జనంన్యూస్)

:మెదక్ జిల్లా జక్కన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద చాపల కిష్టయ్య నివాస పూరి గుడిసె అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా కాలి పోయింది.దీనితో ఆ కుంటుంబం సర్వం కోల్పోయి నిరాశ్రులయ్యారు.ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన జోరావర్ సింగ్ ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు,ఆపదలో ఉన్నవారిని ఆదుకునే నేస్తం బ్యాతోల్ గ్రామానికి చెందిన నాయకుడు పిప్పిరి రవీందర్ గుప్తా వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి కిరాణా సరుకులతో పాటు, బియ్యం,వంట పాత్రలు, బట్టలు,ఆర్థిక సహాయం అందజేశారు.దీనితో గ్రామానికి చెందిన ప్రజలు సహాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.