Listen to this article

జుక్కల్ డిసెంబర్ 29 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంల నాగుల్గావ్ గ్రామంలో సాగు అవుతున్న శెనగ,జొన్న ,కంది పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించి రైతులకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. శెనగ పంటలో ముఖ్యంగా అక్కడక్కడ ఎండు తెగులు ఉధృతిని గమనించి దాని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ (COC) లీటరు నీటికి 3గ్రాములు లేదా ట్యూబాకోనజోల్ 2gm లీటరు నీటికి కలిపి మొక్క బాగా తడిచేలా పిచికారి చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా శెనగ పచ్చ పురుగు వచ్చే అవకాశం ఉన్నందున దాని నివారణకు Emamectin benzoate (EM1) 100గ్రాములు లీటరు నీటికి + వేప నూనె (1500ppm) 500ml ఎకరాకు లేదా Novaluron 300 ml ఎకరాకు కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది.జొన్న పంటలో ఎరువుల యాజమాన్యం గురించి వివరించడం జరిగింది. ఒక ఎకరా జొన్న పంట కోసం యూరియా 77కిలోలు, DAP 52 కిలోలు, పొటాష్ 27కిలోలు అవసరం ఉంటది అని వివరించడం జరిగింది. జొన్న పంటలో ప్రధానంగా కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు ఉధృతిని గమనించి దాని నివారణకు Emamectin benzoate EM1 100గ్రాములు లేదా Profenophos 50EC 400ml ఎకరాకు లేదా Novaluron+ Indoxicarb (Plethora) 100ml ఎకరాకు దానితో పాటు వేప నూనె (1500ppm) ఎకరాకు 1500ml కలిపి మొక్క సుడిలో మందు పడేలా పిచికారి చేయాలని సూచించడం జరిగింది. ఈ క్షేత్ర స్థాయి సందర్శనలో రైతు సోదరులు గుండెవర్ ఉమేష్, హుడేకర్ రవిదాస్, గుండెవర్ సునీల్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.