కుంకుమ దయానంద్ దశదినకర్మల్లో పాల్గొన్న బీఎస్పీ నాయకులు
విద్యానగర్ కాలనీలో శ్రద్ధాంజలి కార్యక్రమం
జన న్యూస్ – డిసెంబర్ 29 (కొత్తగూడెం నియోజకవర్గం)
కొత్తగూడెం పట్టణం పోస్ట్ ఆఫీస్ ప్రాంతానికి చెందిన కుంకుమ దయానంద్ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందగా, ఆయన దశదినకర్మలు విద్యానగర్ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కురిమెల్ల శంకర్ పాల్గొని దయానంద్‌కు ఘనంగా నివాళులర్పించారు.
కుంకుమ దయానంద్ అనేక సంవత్సరాల పాటు షౌరశాల ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతూ కుటుంబ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. తన ఇద్దరు కూతుళ్లకు, ఒక కుమారుడికి వివాహాలు జరిపి కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించిన వ్యక్తిగా ఆయనను పలువురు స్మరించుకున్నారు.
ఈ దశదినకర్మల కార్యక్రమంలో రిపోర్టర్లు దాసరి సాంబశివరావు, నర్సింగ్ విష్ణువర్ధన్, ఎనగందుల సాగర్‌తో పాటు పలువురు స్థానికులు, బంధుమిత్రులు పాల్గొని పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు.


