జనం న్యూస్ ; డిసెంబర్ 29 సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ సిద్దిపేట:
శ్రీవాణీ స్కూల్కు చెందిన 4వ తరగతి విద్యార్థిని వి. జెస్సీ గ్లాడ్, ఈడాక్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో అకడమిక్ ప్రజెంటేషన్ విభాగంలో ప్రతిభ కనబరిచి అవార్డును అందుకుంది. చిన్న వయస్సులోనే అద్భుత ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు దక్కించుకుంది.ఈ సందర్భంగా శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ సిహెచ్. సత్యం జెస్సీ గ్లాడ్కు మెమెంటో అందించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.జెస్సీ విజయం స్కూల్కు గర్వకారణమైందని, ఆమెకు తల్లిదండ్రులు,ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు


