Listen to this article

జనం న్యూస్‌ 30 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

​విజయనగరం పట్టణం దాసన్నపేటలో అతి పురాతనమైన శ్రీశ్రీ చిన్న ఆంజనేయ స్వామికి దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన కవచ ధారణ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాన అర్చకులు అరవెల్లి రామాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.​అనంతరం 108 మంది మహిళలతో దీపారాధన నిర్వహించారు. ఆ తర్వాత భక్తులందరికీ వేద ఆశీర్వాదం ఇచ్చి స్వామి వారి డాలర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సూర్యనారాయణ మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.