జనం న్యూస్ 30 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది మంది తరలిరావడంతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు కొండపైకి ద్విచక్ర వాహనాలను నిలిపివేసి, కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని ట్రాఫిక్ విభాగం కోరింది.


