జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి.ప్రజల సమస్యలను ఓపికగా విని తక్షణమే స్పందించాలి.ధారూర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్.జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ సోమవారం ధారూర్ సర్కిల్ పరిధిలోని ధారూర్, బంట్వారం మరియు కోట్ పల్లి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పోలీస్ స్టేషన్లలోని రికార్డులను, క్రైమ్ రిజిస్టర్లను మరియు పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలను పర్యవేక్షించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో మాట్లాడుతూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా స్టేషన్లో ఎలాంటి ఫైళ్లను పెండింగ్‌లో ఉంచకూడదని, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరేలా చూడాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ప్రజలతో మమేకమై పనిచేస్తూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని మరియు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధారూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్,రఘు రాములు, బంట్వారం ఎస్ ఐ,విమల,కోట్ పల్లి ఎస్ఐ ఎం,శైలజ మరియు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


