జనం న్యూస్: డిసెంబర్ 30.(రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.)
హైదరాబాదు – మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసించే 65 ఏళ్ల సుజాతను బంగారం కోసం హత్య చేసి, గోదావరిలో పడేసిన కేసులో నాచారం పోలీసులు కీలక విజయం సాధించారు. కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లి తాలూకా 33 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ ఎం.అంజిబాబు ఈ ఘోర నేరానికి పాల్పడ్డాడని గుర్తించారు. అతను తన స్నేహితులు యువరాజు (18) మరియు దుర్గారావు (35) సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశాడు.ఈ ఘటనలో, ఈ నెల 24న సుజాత ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె సోదరి పోలీసులు ఫిర్యాదు చేశారు. అంజిబాబు అదృశ్యమవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించిన వారు. విచారణలో అంజిబాబు నేరాన్ని అంగీకరించగా, తన స్నేహితులతో కలసి హత్యను ప్రణాళికగా అమలు చేసినట్టు వెల్లడించారు.నాచారం పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని హత్యకేసులో పాల్గొన్న అంజిబాబు సహా ఇతర స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన బంగారం కోసం జరిగే అకాల నేరాలపై పోలీసుల నైపుణ్యాన్ని స్పష్టంగా చూపించింది.


