Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30

రైతుల సమస్యల పరిష్కారం మరియు గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. తర్లుపాడు మండలం గానుగపెంట, పోతలపాడు గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.పోతలపాడు గ్రామంలో సుమారు 15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కందుల రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అదనంగా సైడ్ డ్రైన్స్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ప్రకటించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేరైతులతోముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనేపూర్తిచేసి,ప్రతిఎకరాకుసాగునీరుఅందిస్తామనిహామీఇచ్చారు.ప్రభుత్వంఅందిస్తున్నరాయితీలు, సంక్షేమ పథకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లఏర్పాటుకుప్రభుత్వంఇచ్చేసబ్సిడీలగురించివివరించారు.ఈకార్యక్రమంలోపంచాయతీ రాజ్ డిఈ రవి ప్రకాష్, ఏడీఏ బాలాజీ నాయక్, ఉద్యాన శాఖ అధికారి రమేష్, ఏఈ మహంకాలయ్య, ఎంపీడీఓ అన్నమ్మ, డిప్యూటీ ఎంపీడీఓ రాఘవ రావు, ఏపీయం రమణి.టీడీపీ మండల అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, మాజీ జడ్పిటీసి రావి బాషాపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పులివేముల యేసు దాసు, క్లస్టర్ ఇంచార్జీ పి. గోపినాధ్ చౌదరి.ఈర్ల వెంకటయ్య, కంచర్ల కాశయ్య, నంద్యాల కాశయ్య, గుర్రపుసాల నరసింహ, మేకల అచ్చిరెడ్డి, కూనపులి మహేష్, నంబుల లక్ష్మయ్య, గిడ్డాలు,తంగిరాల అనిల్ తదితర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.