జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30
మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి తర్లుపాడు మండలంలోని మేకలవారిపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా పార్క్‌లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. పరిశ్రమల ఏర్పాటు వేగవంతం చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, పరిశ్రమదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.ప్రాంత అభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈ పార్క్ కీలక పాత్ర పోషిస్తుందని, దీనివల్ల తర్లుపాడు మండలంతో పాటు మార్కాపురం నియోజకవర్గానికి ఆర్థికంగా లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


