జనం న్యూస్ డిసెంబర్ 29: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలంలోని బట్టాపూర్ గ్రామ సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్‌లు తమ గ్రామంలో ఉన్న సమస్యలు మరియు గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్ (ఐఏఎస్)ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు బట్టాపూర్ గ్రామంలో రైతులకు గోదాం నిర్మాణం, ఇందిరమ్మ కాలనీ అభివృద్ధి, గ్రామంలోని సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం, హైటెన్షన్ విద్యుత్ తీగల తొలగింపు, 45 విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గ్రామంలో 60 వేల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ నిర్మాణం, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల మంజూరు తదితర సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.గ్రామ అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను వారు విజ్ఞప్తి చేశారు.


