జనం న్యూస్ డిసెంబర్ 30: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని నూతనంగా ఎన్నికైన 8 గ్రామాల సర్పంచ్‌లతో మంగళవారం రోజునా మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మండల స్థాయి అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మల్లయ్య , ఏం పి వో, ఏం ఇ ఓ, ఏవో , ఏపీఏం, ఏపీ వో పాల్గొన్నారు. అలాగే అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, ఎఫ్ ఏ లు, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, సర్పంచ్‌లు–అధికారుల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.


