Listen to this article

జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా

కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ఈరోజు గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం రాజాపురం గ్రామంలో గుంటి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారము ద్వారా గుంటి రంగనాథ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులతో పొందారు. అనంతరం,సంకాపురం రాముడు ని వేద పండితులు శాలువా కప్పి,అక్షింతలు వేసి ఆశీర్వదించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అయిజ మండల ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు..అయిజ మండల ప్రజలందరూ గుంటి రంగనాథ స్వామి వారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలతో,ఆయురారోగ్యాలతో,పాడిపంటలతో సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని స్వామి వారిని ఆకాంక్షించారు…ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.