Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 29 జగిత్యాల జిల్లా బీరు పూర్ మండల

కేంద్రము లోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం నందు వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, ఉదయం స్వామివారి అభిషేకము, హారతి మరియు ప్రత్యేకమైన పూజలతో విశిష్టమైన అలంకరణతో స్వామి వారు భక్తులకు ఉత్తర ద్వారా దర్శనమిచ్చారు. . ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వోద్దిపర్థి సంతోష్ చార్యులు చిన్న సంతోష్ చార్యులు మదుకుమార్ చార్యులు మాట్లాడుతూ సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చి ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా మరియు ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారని, ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం ఎక్కి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారని, పూజలు, దానధర్మాల వలన అనేక జన్మల పుణ్యం లభిస్తుందని, ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరవబడతాయని విశ్వాసం అందువల్ల వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారన్నారు.ప్రత్యేక అలంకరణ:ఉత్సవమూర్తులను రకరకాల పుష్పాలతో, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు భారీ బందోబస్తు మరియు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.