జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30
డిమాండ్ ఆధారిత పంటలు జొన్న సజ్జ రాగి కొర్ర వారిగా మొదలగు పంటలు రైతులు సాగు చేసుకోవాలని ఆమె తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి విధానాన్ని బట్టి, మానవుల ఆరోగ్యంపై ప్రభావం ఉన్నందున తృణధాన్యాల సాగును చేపట్టి శరీర రుగ్మతల నుండి రైతులు తప్పించుకోవాలని తెలిపారు. తృణధాన్యాలు విలువ జోడింపులో భాగంగా ప్రభుత్వం వారు మినీ దాల్ మిల్లు, ప్రాసెసింగ్ యూనిట్లు మొదలగునవి జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఆహార ధాన్యాలకు విలువ జోడించినట్లయితే రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని తెలిపారు. తద్వారా రైతులు ఆర్థికంగా నిలదకు పోవడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం వారు వ్యవసాయ శాఖ ద్వారా చేపడుతున్న వ్యవసాయ యాంత్రీకరణ సర్వేలో భాగంగా రైతులందరూ వారికి అవసరమైనటువంటి పనిముట్లు కొరకు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. అనంతరం రైతులు సాగుచేసిన తెల్లజొన్న, మొక్కజొన్న పొలాలను వారితో కలిసి పరిశీలించారు. నంద్యాల తెల్ల జొన్న రకం ఎకరాకు 9 నుంచి 10 కింటాలు వరకు రైతులకు దిగుబడి ఇస్తుంది కావున రబి పంట కాలంలో తెల్లజొన్న వైపు రైతులు ముగ్గు చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ దేవేంద్ర గౌడ్, గ్రామ వ్యవసాయ సహాయకులు వెంకటేశ్వర రెడ్డి, మంగళ కుంట ,తాడివారి పల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.



