Listen to this article

కార్యవర్గాన్నిఘనంగా సన్మానించిన మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి

జనం న్యూస్ డిసెంబర్ 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం:

ఉప సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నిక చేశారు. ఉప సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడిగా ఆసిరెడ్డి హనుమంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జెడి కిషోర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా సున్నపు లక్ష్మి శ్రీనివాస్, కోశాధికారిగా చాట్ల జనార్ధన్, కార్యదర్శిగా లోలపు రాజు, ముఖ్య సలహాదారుడిగా మూడ్ దయానంద్, సలహాదారులుగా సుమన్ గౌడ్, జాకీర్ లను ఎన్నుకున్నట్లు ఫోరం అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి ఫోరం సభ్యులను శాలువలతో ఘనంగా సన్మానించి అభినందించారు.