జనం న్యూస్: డిసెంబర్ 30.(రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.)
వినుకొండ పట్టణంలోని NSP స్థలంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ B.R. నాయుడు ₹3.2 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి మంగళవారం శ్రీ వారిని దర్శించుకున్న అనంతరం టిటిడి చైర్మన్ B.R. నాయుడు గారిని కలిసి వినకొండ టిటిడి కళ్యాణమండపం నిధులు కేటాయింపు పై చర్చించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 3.2 కోట్లు విధులు కేటాయింపుకు ఆమోదం తెలిపారని, టీటీడీ నుండి నిధులను విడుదల చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. వినుకొండలో టీటీడీ కళ్యాణమండపం నిర్మాణానికి నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, చైర్మన్ బి ఆర్ నాయుడుకి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ధన్యవాదాలు తెలిపారు.


