Listen to this article

✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 5 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️

పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి. అరుణ్ బాబు .చిలకలూరిపేట మండలంలోని కావురులో పలు కార్యక్రమాలను పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు.అందులో భాగంగా తొలుత లింగంగుంట్ల గ్రామం కావూరు లో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎంత చెత్తని సేకరించి సంపద సృష్టిస్తున్నారు, ఎంత నగదు వసూలు చేస్తున్నారో తదితర వివరాలను సేకరించి సమస్యలు ఏమైనా ఉన్నాయా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ ఉపాధి హామీ పథకం కింద పంట కాలువలో పూడిక తీత పనులను పరిశీలించి ఎన్ని పని దినాలు కల్పిస్తున్నారు ,ఎంత వేతనం చెల్లిస్తున్నారు, ఉపాధి హామీకి నమోదు చేసుకున్న అందరూ పనులలోకి వస్తున్నారా లేదా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి లింగంగుంట్ల వద్ద భూముల రీ -సర్వే ప్రక్రియను నిసితంగా పరిశీలించి రీ- సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని అవకతవకలకు పాల్పడకుండా కచ్చితంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా సర్వే సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మాధవి లత వివిధ శాఖల అధికా