జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో సోమవారం శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కిరణ్ కుమార్ శిరీష దంపతుల సౌజన్యంతో రాజమండ్రి వారి అమ్మ వాడి సేవతరంగణి వారి ఆధ్వర్యంలో సాక్షాత్తు వైకుంఠ వాసుడైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా లోక కళ్యాణ అర్థం నిర్వహించడం జరిగినది ఈ కళ్యాణంలో విశిష్ట అతిథి ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి గొల కోటి వెంకటరెడ్డి తాడి నరసింహారావు బిజెపి సీనియర్ నాయకులు గ్రంధి నానాజీ మట్ట సూరిబాబు గోలకోటి సాయిబాబు శీలం కోటేశ్వరరావు గాలి దేవర బుల్లి సుంకర శ్రీను బి లక్ష్మీనారాయణ సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాతృమూర్తులు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని స్వామి వారి యొక్క దివ్య ప్రసాదం తిరుపతి లడ్డు కదంబ ప్రసాదం వితరణ చేయడం జరిగింది



