Listen to this article

జనం న్యూస్‌ 31 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి మరియు ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఒక ప్రకటన ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త ఏడాది జిల్లా ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గడచిన ఏడాదిలో ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోయి, సరికొత్త ఆశలతో ముందడుగు వేయాలని సూచించారు. ఈ 2026 సంవత్సరం జిల్లాలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, కార్మికులు మరియు అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో ఉండాలని ఆయన తన నూతన సంవత్సర సందేశంలో కోరుకున్నారు.