జనం న్యూస్ 31 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాలాజీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయంలో ప్రత్యేక ధనుర్మాస పూజలు, హోమం మరియు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయగా, దర్శనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.


