Listen to this article

జనం న్యూస్‌ 31 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

బొబ్బిలి నియోజకవర్గం మొత్తం మీద ప్రజలు సేదతీరడానికి అందుబాటులో ఉన్నది ఒక్క మున్సిపల్ పార్క్ మాత్రమే..కానీ పార్క్ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే..గత కొద్ది రోజుల క్రితం 7 లక్షలతో బయట ఐ లవ్ బొబ్బిలి పేరిట,ఐకాన్ ఆఫ్ బొబ్బిలిని ఏర్పాటు చేసినప్పటికీ,గేటు దాటి పార్కులోకి వెళ్లిన వారికి కళ్ళు తిరగడం ఖాయం.అంతా కళావిహీనంగా కనబడుతుంది..,లోపల ఉన్న చెట్లు మరియు గడ్డి చాలావరకు ఎండిపోవడం జరిగింది,చాలా ప్రాంతాల్లో గోడలు మరియు గచ్చులు విరిగిపోయి ఉన్నాయి. ఓపెన్ జిమ్ దగ్గర కూడా కొన్ని వస్తువులు పాడైపోవడం జరిగింది. ఇక పార్కును ఆనుకొని ఉన్న చెరువు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది.చెత్తాచెదారాలు, మొక్కలు అన్ని చెరువులో వేయడంతో చెరువు పూర్తిగా వ్యర్ధాలతో నిండి ఉంది.చిల్డ్రన్ పార్క్ లో కూడా కొన్ని వస్తువులు వాడైపోయి ఉన్నాయి.మరికొద్ది రోజుల్లో పెద్ద పండుగ, సంక్రాంతి పండుగ రాబోతుంది.ఆ సందర్భంగా దేశ విదేశాల నుంచి బొబ్బిలి ప్రాంతానికి చెందిన చాలామంది బొబ్బిలి రావటం జరుగుతుంది. ఆటవిడుపు కోసం వారంతా పార్కుకు వస్తే మాత్రం తప్పకుండా వారు అసంతృప్తికి గురవుతారు.ఉన్న ఒక్క పార్కును కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారే అని వారు బాధపడడం ఖాయం.కాబట్టి వచ్చే చుట్టాలు,బంధువులు దగ్గర మన బొబ్బిలి గౌరవం తగ్గకుండా, వెంటనే మున్సిపల్ పార్కులో ఉన్న సమస్యలను పరిశీలించి పార్కును బాగు చేస్తే బాగుంటుందని బొబ్బిలిలో మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని,సంక్రాంతి పండగ వచ్చే లోపు పార్కును బాగు చేస్తే మంచిదని ప్రజల నుంచి డిమాండ్..