Listen to this article

జనం న్యూస్ 31 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

తల్లిని జీవితాంతం పోషిస్తానని నమ్మించి ఇల్లు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇంటి నుంచి గెంటి వేశాడంటూ తల్లి ఆవేదన. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.తల్లిని బ్రతికినంత కాలం పోషిస్తానని నమ్మించి ఇల్లు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రాత్ గయా-బాత్ గయా అన్నట్టు తల్లిని ఇంటి నుంచి గెంటి వేశాడట ధరూర్ మండలంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ గా ఉన్న పెద్దకుమారుడు బోయ వెంకటరాములు.వివరాల్లోకి వెళ్తే గద్వాల పట్టణం సుంకులమ్మ మెట్టు ప్రాంతానికి చెందిన బి. నర్సమ్మ తన భర్తచంద్రన్న అనారోగ్యరీత్యా చనిపోగా,ధరూర్ మండలంలో విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న పెద్ద కుమారుడు బి.వెంకట్రాములు మాయ మాటలు నమ్మి తమ సొంత ఇంటిని గిఫ్ట్ డీడ్ ద్వారా అతని పేరుపై రిజిస్టర్ చేయించారు. అయితే భర్త మరణం తర్వాత తన పోషణను పట్టించుకోకపోగా, ఇంటి నుంచి తిట్టి,కొట్టి వెళ్లగొట్టాడని నర్సమ్మ ఆరోపించారు. పక్షవాతంతో బాధపడుతూ, నడవలేని స్థితిలో ఉన్న నర్సమ్మ ప్రస్తుతం చిన్న కుమారుడి ఇంట్లో దుర్భర జీవనం గడుపుతున్నారు. మందులు, భోజనం కూడా కష్టంగా మారిందని వాపోయారు.మోసం చేసి చేయించుకున్న గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి, తన పేరపై మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు కు నర్సమ్మ ఫిర్యాదు చేసారు.ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుల తీరే ఈవిధంగా వుంటుందా? లేక పెద్ద కొడుకుల పెళ్ళాల తీరు వల్ల మారి ఇలా తయారవుతార? అనేది డౌట్. ఏది ఏమైనా జన్మనిచ్చిన తల్లికి ఎంత చేసినా తక్కువే. ఆమె ఋణం తీర్చలేనిది.తల్లి విలువ తెలిసినోడు భరిస్తారు,తల్లి ఆస్తినే చూసుకున్నోడు గెంటేస్తాడు.