Listen to this article

జనం న్యూస్ 31 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులమ్మ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం మేడికొండ గ్రామం రచయిత మేడికొండ బాష చిన్న వయసులోనే మేడికొండ బాష కవిత్వంపై పట్టుదల ఉండడం అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం మేడికొండ గ్రామానికి చెందిన కవి రచయిత మేడికొండ బాష తను రచించిన సుగంధ పరిమళాలు పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్ లోని నందినగర్ లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి సుగంధ పరిమళాలు పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడికొండ బాష ను ఆశీర్వదిస్తూ , దీవించారు. చిన్న వయసులోనే కవిత్వం పై పట్టుదల పెట్టుకోవడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కవిత్వం పట్ల మేడికొండ బాష ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మరోసారి ఆశీర్వదించారు._