Listen to this article

జనం న్యూస్ 31డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

జైనూర్ :-మండల కేంద్రంలో హైమాస్ లైట్స్ కోసం ఆసిపాబాదు ఏమ్మెల్యే కోవ లక్ష్మి నిధులను మంజూరు చేశారని అట్టి నిధులతో పనులను బుధవారం ప్రారంభించడం జరిగిందని,సర్పంచ్ కోడప ప్రకాష్,అన్నారు
జైనూర్ మార్కెట్ కమిటి చైర్మన్ కుడ్మత విశ్వనాథ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాధవరావు,జైనూర్ మాజీ సహకార చైర్మన్ కోడప హన్ను పటేల్, లతో కలిసి పనులకు ప్రభుత్వ అసుపత్రి ప్రాంగణంలో భూమి పూజచేశారు.కుమ్రం భీం చౌరస్తా వద్ద, హనుమందిరం,ప్రభుత్వ అసుపత్రి ప్రాంగణంలో మూడు చోట్ల, ప్రధామైన కుడలిలలో ఆసిపాబాదు శాసన సభ్యురాలు కోవ లక్ష్మి చోరవతో తన ఏమ్మెల్యే నిధులతో మండల కేంద్రంలో హైమస్ లైట్ ల కోసం నిధులు మాంజూరు చేయడంతో స్థానిక సర్పంచ్,తో పాటు గ్రామపంచాయితీ ప్రజలు ఏమ్మెల్యే కోవ లక్ష్మి గారికి, కృతజ్ఞతలు తెలియజేశారు.కోడప ప్రకాష్ సర్పంచ్ గా విజయం సాధించడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు అభినంధనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఏస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల,మాజీ సర్పంచ్ మడవి భీంరావు,మాజీ యంపిటిసి,భగవంతరావు,పవుర్ గూడ సర్పంచ్ తోడసం రాజు,కాంగ్రేస్ నాయకులు మెస్రం అంబాజీ,పంచాయితీ కార్యదర్శ అనంద్ రావు, అసుపత్రి డాక్టర్ ఆశోక్ తదితరులు ఉన్నారు.