

జనం న్యూస్ జనవరి
10-01-2025 రేగోడ్ మండల మెదక్ జిల్లారిపోర్టర్:వినయ్ కుమార్ రేగోడు మండల కేంద్ర లో సిఎన్ఆర్ స్మారక సీజన్ 3 రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీ ని నిర్వహించడం జరిగింది అనంతరం చెన్నై గారి నర్సింలు చిత్రపటానికి పూవులు వేసి కుటుంబ సభ్యులు చక్రపాణి, వెంకటరత్నం ,ఉపేంద్ర మరియు మండల నాయకులు నివాళులర్పించి టోర్నీ నీ ప్రారంభించారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వం కలిగిస్తాయని, అన్నారు. తదనంతరం రేగోడు మరియు మనూర్ చెందిన క్రీడాకారులను అభినందనలు తెలిపి టోర్నీ నీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ మున్నూరు కిషన్ రేగోడు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిగంబరావ్, మాజీ జెడ్పిటిసి యాదగిరి ఉపాధ్యక్షులు గున్న సంగమేశ్వర్ కోఆప్షన్ చోటిమియా,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గంజి సంగమేశ్వర్, ఫాజిల్, జిల్లా ఎస్టి అధ్యక్షులు పిర్య నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.